Breaking News

గృహయజ్ఞం..

Published on Sat, 06/03/2023 - 02:16

పృథులగిరి ఘాట్‌ నిర్మాణానికి రూ.5 కోట్లు పృథులగిరి ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి.
25

చోరీ కేసులో ముగ్గురు అరెస్టు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు గొలుసు, బైక్‌ రికవరీ చేశారు.

వాతావరణం

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత అధికం. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.

8లో..

శనివారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2023

ఒంగోలు

నగరంలో

వేల మందికి ఇళ్ల పట్టాలు

● పేదలకు స్థలాలు దక్కకుండా టీడీపీ కుట్రలు

అద్దె ఇళ్లల్లో అవస్థలు పడుతున్న నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలి..అది కూడా ఒకే చోట ఇచ్చి ఒక పట్టణాన్ని నిర్మించాలని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తలంచారు. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ న్యాయపరమై చిక్కులు కల్పించి మోకాలడ్డింది. టీడీపీ కుయుక్తులకు బాలినేని పైఎత్తులు వేశారు. ఎలాగైనా పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో అడుగులు వేశారు. నగరం చుట్టూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించి 24 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంచారు. ఇది ప్రభుత్వంపై భారమైనా సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

గరంలోని నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి భావించారు. నగర పరిసరాలతో పాటు ఒంగోలు మండల పరిధిలో 508 ఎకరాలు సేకరించి ఇళ్లు కట్టించాలని తలంచారు. రైతుల వద్ద నుంచి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి ఇవ్వటానికి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంగీకారం తెలిపారు. భూములు కొనుగోలు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయించారు కూడా. ఇప్పటికే రైతుల వద్ద కొనుగోలు చేసిన భూముల కోసం రూ.30 కోట్లు విడుదల చేశారు.

నాలుగు గ్రామాల పరిధిలో...

ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నాలుగు గ్రామాలను గుర్తించారు. మొత్తం దాదాపు 25 వేల మందికి ఇచ్చేలా స్థలాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెంను ఆనుకొని యరజర్ల రెవెన్యూకు చెందిన కొంత భూమిని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ నాలుగు గ్రామాల పరిధిలోని 453 ఎకరాలను కలెక్టర్‌ ఏఎస్‌.దినేష్‌ కుమార్‌ మంజూరు చేశారు. స్థలాలు గుర్తించిన అధికారులు సర్వే నంబర్ల సబ్‌ డివిజన్‌ ప్రక్రియలు ప్రారంభించారు. సర్వే నంబర్ల వారీగా అనుభవదారులు, హక్కుదారులను గుర్తించి వారి వద్ద నుంచి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అది కూడా పూర్తి కావస్తోంది. మిగతా 55 ఎకరాలను కూడా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకారం...

నిరుపేదలకు 24 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిద్దామన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి నిర్ణయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఆ ఏర్పాట్లు చేసుకోవాలని బాలినేనికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దీంతో భూముల పరిశీలన, భూముల కొనుగోలు నిధులు కేటాయింపు అన్నీ చకా..చకా జరిగిపోయాయి. భూముల కొనుగోలుకు రూ.200 కోట్లతో పాటు కొనుగోలు చేసిన భూముల్లో ప్లాట్లుగా వేయటానికి చదును చేయటం, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుదీకరణ, మంచినీటి సౌకర్యం కల్పించటం లాంటి మౌలిక వసతుల కోసం మరో రూ.85 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.

న్యూస్‌రీల్‌

ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం

టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్లులేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చి తీరుతాం. టీడీపీ నాయకులు ఎన్ని అవాంతరాలు కల్పించినా నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం మాత్రం ఆపేది లేదు. సీఎం వైఎస్‌ జగన్‌కు ఇళ్ల పట్టాల విషయం చెప్పాను. కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలు అయినా కొనుగోలు చేసి ఇద్దామని హామీ ఇచ్చారు. దీంతో ఒంగోలు నగరం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల పరిధిలో దాదాపు 508 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వటానికి భూములు గుర్తించి కొనుగోలు ప్రారంభించాం. అందుకోసం రూ.200 కోట్లు కేటాయించాం. దాదాపు 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చర్యలు వేగవంతం చేశాం.

– బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే

పేదల ఇళ్ల కోసం బాలినేని తపన...

టీడీపీ నేతలు పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుపడటంతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న వారికి నిలువ నీడ కల్పించాలని ఐదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాడే తలంచారు. అప్పటి నుంచి నగరంలో ఉన్న దాదాపు 25 వేల మందిని గుర్తించి వారికి గూడు కల్పించాలని నిర్ణయించారు. వెంటనే ప్రభుత్వ స్థలం ఒకేచోట ఎక్కడ ఉందో పరిశీలించాలని రెవెన్యూ అధికారులను పురమాయించారు. యరజర్ల వద్ద ఒకేచోట 818 ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. భూమిని చదును చేసి ప్లాట్లు కూడా వేశారు. అక్కడే శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మించాలని యోచించి ఒంగోలును మహానగరం చేయాలనుకున్నారు. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తన అనుచరుల చేత హైకోర్టులో కేసు వేయించి అక్కడ ప్లాట్లు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. ఒకేచోట అంత పెద్ద శాటిలైట్‌ టౌన్‌ షిప్‌ నిర్మాణం జరిగితే తనకు జనాల్లో పుట్టగతులు ఉండవని భావించి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకుండా సైంధవునిలా అడ్డుపడ్డాడు. ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనకు బాలినేని పదును పెట్టారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోయినా ప్రైవేటు స్థలం అయినా కొనుగోలు చేసి ఇవ్వాల్సిందేనని గట్టి నిర్ణయానికి వచ్చారు.

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)