త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!
Breaking News
పసుపు మద్దతు ధర క్వింటాకు రూ.6,850
Published on Sat, 06/03/2023 - 02:16
ఒంగోలు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతు పంటలకు మద్దతు ధర కల్పించేందుకు పసుపు క్వింటాకు రూ.6,850 లెక్కన ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్‌లో నమోదైన రైతులు వారికి సంబంధించిన రైతు భరోసా కేంద్రాల్లో సంబంధిత వీఏఏ, వీహెచ్‌ఏల ద్వారా సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 4వ తేదీ వరకు ఈ అవకాశం ఉందన్నారు. నమోదు చేసుకున్న రైతుల సరుకు కొనుగోలుకు జూన్ 12వ తేదీ వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పసుపు రైతులు తమ పేర్లు నమోదు చేసుకునే సమయంలో పంట నూర్పిడి తేదీని కూడా నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్టర్ మొబైల్‌కు మెసేజ్ వస్తుందని చెప్పారు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్‌కు ఫోన్ నంబర్ లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలన్నారు. రైతులు పంటను శుభ్ర పరుచుకుని, ఆరబెట్టుకుని ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Tags : 1