Breaking News

పాముకాటుతో కానిస్టేబుల్‌ మృతి.. ఎస్సై కావాలన్న ఆశ తీరకుండానే

Published on Thu, 05/25/2023 - 10:58

ప్రకాశం: తుళ్లూరు మండలం అనంతవరం ఆర్‌–5 జోన్‌లో విధుల నిమిత్తం వెళ్లిన తాళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఇరిగిపోయిన పవన్‌కుమార్‌ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రెండు రోజులుగా గుంటూరు రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డయాలసిస్‌ చేసి అన్ని విధాలుగా ప్రయత్నించినా పవన్‌కుమార్‌ మృతి చెండటం పోలీస్‌ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీస్‌ ఉన్నతాధికారులు, దర్శి డీఎస్పీ, సీఐ, ఎస్సైలు నిరంతర పర్యవేక్షణ చేసినా సరే పవన్‌కుమార్‌ను దక్కించుకోక పోయారు. పవన్‌కుమార్‌ది చీమకుర్తి పట్టణం. 2012 జవవరి 19లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తాళ్లూరు, ఒంగోలు వన్‌ టౌన్‌, ముండ్లమూరులలో పనిచేసి మళ్లీ 2020 జనవరి 2న తాళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లలో జాయిన్‌ అయ్యారు. ఎస్సైగా ఎప్పటికై నా ఎంపిక కావాలన్న ఆశయంతో ఉంటూ అంకితభావంతో పనిచేసే పవన్‌ ఇక లేక పోవటం దురదృష్టకరమని స్నేహితులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. పవన్‌కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)