Breaking News

కాంగ్రెస్‌ సభ వేళ బీఆర్‌ఎస్‌ బిగ్‌ షాక్‌

Published on Sat, 07/01/2023 - 12:56

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ జెట్‌ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సక్సెస్‌ అయిందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఖమ్మం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులు ప్లాన్స్‌ చేస్తున్నాయి. ఇక, రేపటి సభలో రాహుల్‌ గాంధీ సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ చేరునున్నారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచిన వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌​ తగిలింది. రేపు ఖమ్మం సభలో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ పార్టీకి నేతలు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన బాటలోనే సత్తుపల్లిలో ముగ్గురు కౌన్సిలర్లు అధికార పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటితో కలిసి ముందుకెళ్తున్నట్టు ముగ్గురు కౌన్సిలర్లు ప్రకటించారు. 

ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి పకడ్బందీగా చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ సభకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకుంటున్నారు. సభ జరిగే రోజున ఖమ్మంలో మంచినీరు వదలొద్దని అధికారులను ఆదేశిస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో సభ విజయవంతం కావొద్దని జిల్లా మంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్‌ సభ ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: మా వల్లే పార్టీ హైలైట్‌ అయ్యింది.. మమ్మల్నెందుకు పట్టించుకోరు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)