Breaking News

బాబుకు సీమ కన్నా.. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం: విశ్వేశ్వర రెడ్డి

Published on Mon, 01/12/2026 - 11:35

సాక్షి, అనంతపురం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సూటిగా స్పందించకపోవడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది వ్యాఖ్యలు చేశారు.

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లుగా టీడీపీ, కూటమి నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది. రాయలసీమ కు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు.

అలాగే, లిఫ్ట్ కాదు తెఫ్ట్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు. తాను చేసినట్టే అందరూ అవినీతి చేస్తారని పయ్యావుల కేశవ్ భావిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగి ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు ఎందుకు మంజూరు చేశారు?. రాయలసీమ లిఫ్ట్‌ను ప్రాజెక్టే కాదని మంత్రి కేశవ్‌ ఎలా అంటారు?. ప్రాజెక్టు కాదన్నవారు రూ.190 కోట్లు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి దాకా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. చంద్రబాబుకు సీమ ప్రయోజనాల కన్నా.. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు. 

Vishweshwar : ప్రాజెక్టే కాదన్నవారు రూ. 190 కోట్లు ఎలా ఇచ్చారు?

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)