Breaking News

ఆ ఆదాయం ఎక్కడికి పోతోంది.. వైఎస్సార్‌సీపీ ట్వీట్‌

Published on Wed, 09/17/2025 - 20:13

సాక్షి, తాడేపల్లి: ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైఎస్సార్‌సీపీ ఆశ్చర్య వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, పర్మిట్ రూముల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గటంపై మండిపడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందంటూ ట్వీట్ చేసింది.

ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో అనేక మార్పులు చేసింది. మద్యం షాపులను తమవారి చేతిలో పెట్టారు. మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. పర్మిట్ రూమ్‌లను మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వలన సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్‌ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో కూడా సహజంగా 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ అన్ని మార్పులు చేసినా ఆదాయ వృద్ధి తగ్గటం ఆశ్చర్యమేస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు విపరీతమైన నష్టం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వలనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ  ట్వీట్‌ చేసింది.

Videos

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)