Breaking News

‘బాబూ.. మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో సఖ్యత ఉందా?’

Published on Sat, 11/02/2024 - 14:26

సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోలీసుల ద్వారా ప్రతిపక్షంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.

టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తాజాగా మీడియాతో​ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ అపర మేధావి అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో నిజంగా చంద్రబాబు మేధావే. అందుకే హామీలను అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క హామీని నెరవేర్చింది. అది రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడం. దీపం పథకంలో ఉచిత సిలిండర్‌ ఇస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు.

హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు సహా కూటమి నేతలు మహిళలను మోసం చేస్తున్నారు. గతంలోనూ  డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇలాగే మహిళలను మోసం చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చంద్రబాబుకు మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో, పురంధేశ్వరితో సఖ్యత ఉందా?. చంద్రబాబు తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తుంది’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)