Breaking News

ఫ్యాన్‌ ప్రభంజనం.. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ

Published on Sat, 08/19/2023 - 18:37

సాక్షి, అనంతపురం జిల్లా: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాన్‌ స్పీడ్‌కు ప్రత్యర్థులు నలవలేకపోతున్నారు. తాజాగా, పలు పంచాయితీలు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయం సాధించారు. 337 ఓట్లతో సర్పంచ్‌గా ఉపేంద్రరెడ్డి గెలుపొందారు.

తాడిపత్రిలో..
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్‌, 245 వార్డు మెంబర్ల స్థానాలకు  ఉప ఎన్నికలు జరిగాయి.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)