Breaking News

‘పవన్‌.. సుగాలి ప్రీతికి న్యాయం, 30 వేల మంది అదృశ్యం సంగతి ఏమైంది?’

Published on Fri, 09/12/2025 - 15:04

తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్‌12) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి. 

మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల  దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై  పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే  సమాధానం చెప్పాలి. 

ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?,  మా నాయకుడు వైఎస్‌ జగన్‌కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు.  అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: 
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)