Breaking News

‘లోకేష్‌.. చాలెంజ్‌ చేసి పారిపోవడం సిగ్గుచేటు’

Published on Tue, 07/28/2026 - 15:51

తాడేపల్లి : ఏపీ మంత్రి నారా లోకేష్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలని, చాలెంజ్‌ చేసి పారిపోవడం ఆయనే చెల్లిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధథి పుత్తా శివశంకర్‌ విమర్శించారు. నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రగల్భాలు పలకడం నిజంగా సిగ్గుచేటన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే భయంతో సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు. 

ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్‌.. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి  ప్రధాన్‌ రాజీనామా చేశారని, అదే ఎన్డీయేలో భాగమైన టీడీపీ మంత్రి డీఎస్సీ అక్రమాలపై ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 

‘నారా లోకేష్ వ్యవహార శైలిపై జెన్ జీ ఆగ్రహంతో ఉంది. అందుకే ఈరోజు మా పార్టీ నిర్వహించిన నిరసనల్లో జెన్ జీ పెద్ద ఎత్తున పాల్గొంది. జెన్ జీ రెస్పాన్స్ చూసి టీటీడీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారలతో సహా బయట పెట్టారు. ఆయన వేసిన ప్రశ్నలకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేకపోయారు. నారా లోకేష్ ఉత్తరకుమార ప్రగల్భాలు తప్ప సరైన సమాధానమే చెప్పలేదు. 

డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే నారా లోకేష్ తోక ముడిచారు. జగన్‌కు ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్‌కి లేదు. లోకేష్‌కు మా పార్టీ అధికార ప్రతినిధులు చాలు.  మే8వ తేదీన నారా లోకేష్‌కు పేర్ని నాని ఓపెన్‌ చాలెంజ్‌ చేశారు. అయినా సరే లోకేష్‌ స్పందించలేదు. ఇప్పటికైనా లోకేష్‌ స్పందించి పేర్ని నానితో చర్చకు రావాలి.. లేదంటే జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)