Breaking News

పవన్ కళ్యాణ్‌పై YSRCP సీరియస్

Published on Thu, 11/13/2025 - 15:31

సాక్షి, తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే పాచిపోయిన ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నించింది. తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు చేసిన వపన్ కళ్యాణ్‌పై మండిపడింది. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది.

‘‘డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది. ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే  అబద్ధాలు నిజాలు అవుతాయా?

..సర్వే సెటిల్‌ మెంట్ డైరెక్టర్‌ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్‌కళ్యాణ్‌ కాదనగలరా?. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి, విచారణలమీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు.

..ఇన్నిరోజుల్లో ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయారు. నేపాల్‌కు ఎర్రచందనం అంటూ ఇదే వపన్‌కళ్యాణ్‌ అర్థంలేని విమర్శలు చేశారు. నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్‌ విసిరితే ఇప్పటికీ దానిపై నోరు మెదపలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుపాను నష్టపరిహారం అందించలేక ఇంకా అనేక సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ దుయ్యబట్టింది.

 

 🚨 Dare to answer these questions, @PawanKalyan ?

డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ… https://t.co/vyPJQ0kSWp

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)