Breaking News

‘దిశ’ పేపర్లు చించేసి ‘సురక్ష’ తెస్తున్నారా?: పుత్తా శివశంకర్‌

Published on Sat, 02/22/2025 - 13:54

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ‘దిశ’ యాప్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌. రాష్ట్రంలో అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అమ్మాయిలపై జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్‌ జగన్ ‘దిశా’ యాప్ తెచ్చారు. దిశా యాప్‌ను కోటి యాభై లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఏ మహిళ, ఆడపిల్ల ఆపదలో ఉన్నా ఈ యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం కల్పించారు. క్షణాల్లోనే బాధితులను కాపాడిన ఘనత వైఎస్‌ జగన్ ప్రభుత్వానిది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేశారు.

అమ్మాయిల‌ మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రజల నుండి తీవ్ర విమర్శలు వచ్చేసరికి మళ్ళీ సురక్ష పేరుతో యాప్‌ను తీసుకువస్తున్నారు. ఇప్పటికే దిశా యాప్, పోలీసు స్టేషన్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా వాడుకుని మహిళలను రక్షించండి. గతంలో ఈ యాప్‌ను తెచ్చినప్పుడు ఇప్పటి హోంమంత్రి అనిత పేపర్లను తగులబెట్టారు. ఇప్పుడు మళ్ళీ సురక్ష పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జనసేన, టీడీపీకి చెందిన కొందరు నేతలు.. మహిళలపై అఘాయిత్యాలు పాల్పడ్డారు. వారిపై కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు. ఇటువంటి కూటమి పాలనలో మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది?’ అని ఘాటు విమర్శలు చేశారు. 

దిశ యాప్ తీసేసి జనాలు అమాయకులు కాదు  హోంమంత్రి అనితకు కౌంటర్

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)