Breaking News

Bus Yatra: జనంలోకి సీఎం జగన్‌

Published on Mon, 03/18/2024 - 12:29

సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. 

ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది.

మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది.  తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. 


( ఫైల్‌ ఫోటో )

ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్‌సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్‌ జగన్ వెళ్లనున్నారు. 

ఇదీ చదవండి:  ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో!?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)