Breaking News

సరికొత్త నినాదంతో జనంలోకి YSRCP

Published on Mon, 04/15/2024 - 13:16

గుంటూరు, సాక్షి: నిలువెల్లా విషం నింపేసుకున్న రాజకీయ ప్రత్యర్థులు.. అక్కసుతో ఆయనపై రాళ్లు వేయించారు. పైగా సింపథీ డ్రామాలంటూ ఎల్లో మీడియా ద్వారా రివర్స్‌ ఎటాక్‌ చేస్తున్నారు. కానీ, సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం.  సంయమనంతో వ్యవహరిస్తూ.. నొప్పిని భరిస్తూనే చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పచ్చ కుట్రల్ని అర్థం చేసుకుంటు‍న్నారు గనుకే జనం సైతం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త స్లోగన్‌ తెరపైకి రాగా.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.

కొన్నాళ్ల కిందట సిద్ధం..  పేరుతో ఎన్నికల సమరశంఖారావం పూరించారు సీఎం జగన్. కేవలం రెండు అక్షరాలతోనే షెడ్యూల్‌ రాకముందే ఎన్నికల వాతావరణం సృష్టించగలిగారాయాన. అంతేకాదు దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో నాలుగు సిద్ధం సభల్ని నిర్వహించి.. అశేష ప్రజా స్పందన దక్కించుకున్నారు. సిద్ధంను కాపీ కొట్టి మేము కూడా సిద్ధం, సంసిద్ధం అంటూ విపక్షాలు ప్రచారం చేసుకున్నాయేగానీ అవి అస్సలు వర్కవుట్‌ కాలేదు. ఆపై కొత్తగా ఎన్ని స్లోగనులు తెచ్చినా.. జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి.  

ఈ టైమ్ లో వైసీపీ మరో సరికొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో ముందుకు వచ్చింది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్ని మినహాయించి 21 రోజుల యాత్రను చేపట్టారు సీఎం జగన్‌. మేమంతా సిద్ధంలోనూ సీఎం జగన్‌కు బ్రహ్మరథమే పడుతున్నారు జనం. ఇక ఇప్పుడు.. జగన్‌ కోసం సిద్ధం అంటూ మరో కొత్త స్లోగన్‌ను తెరపైకి తెచ్చింది. 

పార్టీకి సంబంధించి ప్రచారాల విషయంలో వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి దూకుడునే ప్రదర్శిస్తోంది. వైవిధ్యతతో జనాల్ని ఆకట్టుకోగలగడమే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ విషయంలో  అనుకూల మీడియా, ఆస్థాన రచయితలు ఉన్న టీడీపీ మాత్రం ప్రచార వ్యూహాల్లో వైఎస్సార్‌సీపీకి దరిదాపుల్లోకి రాలేకపోవడం గమనార్హం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)