Breaking News

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: ఎంపీ నిరంజన్‌ రెడ్డి

Published on Fri, 07/26/2024 - 13:43

సాక్షి, ఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌ రెడ్డి. పార్లమెంట్‌ వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

కాగా, రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం.. ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.  ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు . ఏపీకి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. నగరాల అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. 

అలాగే, ‘కేంద్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రవేశపెట్టారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. పన్ను కట్టలేదని పెట్టుబడిదారులను జీఎస్టీ అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్న పెట్టుబడిదారుల పట్ల జీఎస్టీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారుల పట్ల అనుచితంగా వ్యవహరించవద్దు. పెట్టుబడిదారుల్లోభయాన్ని తొలగించాలి. అధికారుల వేధింపుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో, రియల్ ఎస్టేట్‌ షేర్లలో వారు పెట్టుబడి పెడుతున్నారు. దాని వల్ల దేశానికి జీడీపీకి పెద్దగా ఉపయోగం లేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి‪

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)