Breaking News

ఏపీలో రెడ్‌ బుక్‌ పాలన.. రాజ్యాంగంపై చర్చలో ఎంపీ గురుమూర్తి

Published on Sat, 12/14/2024 - 15:10

సాక్షి, ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్‌ బుక్‌ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని.. కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందన్నారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి.. జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.

ఈ పథకాలు ఆయా వర్గాలను పైకి తీసుకొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రాజ్యాంగం ఒక జీవన పత్రం. అసమానతలను తగ్గించే ఒక సాధనం రాజ్యాంగం. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదర భావనకు రాజ్యాంగం పెద్దపీట వేసింది. కేశవానంద భారతి కేసు రాజ్యాంగం పునాదులను మరోసారి నిర్వచించింది. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ ప్రయాణంలో ఎంతో ప్రగతి సాధించాం.’’ అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక  చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ ఎకానమీ నుంచి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది.

ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట

..అక్షరాస్యతలో 74 శాతం సాధించాం. జీవన స్థాయి 70 ఏళ్లకు పెరిగింది. వాతావరణం మార్పులు జీ-20 విషయాల్లో భారత ప్రపంచం నాయకత్వం వహిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక సమానతలు ఇంకా సవాలుగానే పరిణమిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, లింగ అసమానత్వాన్ని రూపుమాపితేనే నిజమైన సమానత్వం వస్తుంది’’ అని ఎంపీ గురుమూర్తి చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)