Breaking News

‘ఈసీ ప్రకటించిన పోలింగ్‌ బూత్‌ లిస్ట్‌ దారుణంగా ఉంది’

Published on Fri, 08/08/2025 - 19:29

వైఎస్సార్‌ జిల్లా:  పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరలేపుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.   ఈ ఎన్నికకు ఈసీ విడుదల చేసిన పోలింగ్‌ బూత్‌ లిస్ట్‌ చూస్తే దారుణంగా ఉందన్నారు. ‘ ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరతీసింది. నల్లపురెడ్డిపల్లె వారు ఎర్రబెల్లి వెళ్ళి ఓటేయాలి అంటున్నారు. గతంలో ఏ గ్రామంలో ఉండే బూత్ లో వాళ్ళు ఓటేసుకున్నారు. ఇప్పుడు మార్చిన తీరు ప్రకారం 4 కిలో మీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సి వస్తోంది. 

దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది. మొన్న నల్లగొండపల్లిలో ఎంత దాడికి దిగారో మీకు తెలుసు. మరి ఈ ఓటర్లు వేరే ఊరికి వెళ్లి ధైర్యంగా ఎలా ఓట్లు వేయగలరు. ఇది అర్థరహితం. కేవలం పోలింగ్ శాతం తగ్గించాలి అనే టీడీపీ ఈ ప్రయత్నం చేస్తోందా..?, ఎన్నికల కమిషన్ అందరూ ఓటేసేలా చూడాల్సిన బాధ్యత ఉంది. 6 పోలింగ్ బూత్ లపై ఈ ప్రభావం ఉంది. 3,900 ఓట్లు 36 శాతం మందికి ఈ సమస్య తలెత్తింది. ఎప్పుడైతే బూత్ ల లిస్టు విడుదలైందో అప్పుడు టీడీపీ కుట్ర బయటపడుతుంది. 

ఇప్పటికే దాడులు, బైండోవర్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మరో ఘనకార్యం చేసారు...బూత్ లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేసారు. ఎట్టిపరిస్థితుల్లో ఏ ఊర్లో వాటిని అదే ఊర్లో ఓటేసి అవకాశం కల్పించాలి. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలి. తప్పనిసరిగా పోలింగ్ బూత్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 2021లో ఏవిధంగా అయితే బూత్ లు ఉన్నాయో అలానే ఉంచాలని వినతి’ అని ఎంపీ అవినాష్‌ స్పష్టం చేశారు.

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)