Breaking News

‘అవినీతే సిగ్గుపడేలా..కూటమి ప్రభుత్వం అవినీతి’

Published on Tue, 05/06/2025 - 15:08

తాడేపల్లి : అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా,  వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కాం చేస్తున్నారన్నారు.

‘అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తున్నారు. అప్పుల్లోనే కాదు, అవినీతిలోనూ రికార్డు సృష్టించారు. బాబు ష్యూరిటీ, అవినీతి గ్యారెంటీగా మారిపోయింది. NDA అంటే నారా దోపిడీ అలియెన్సుగా మారిందిమహిళ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్దిరోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? , జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర్నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారు.

కాపు మహిళల కోసం జగన్ కాపునేస్తం తెచ్చారు. చంద్రబాబు కాపు మహిళలకు ఏం చేశారు? , ఇసుక, మట్టి, మద్యం, అమరావతి నిర్మాణాలు, ఉర్సా భూములు ఇలా ప్రతిదానిలోనూ స్కాం చేస్తున్నారు. కుట్టుమిషన్ల స్కీంని కమీషన్ల స్కాంగా మార్చారు. రూ.7,300 వేలు ఖర్చయ్యే దానికి రూ. 23 వేలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు?, రూ.157 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేశారు.

మొబలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చి అవినీతికి రెడీ చేశారు. L1 కి ఐదు శాతం వర్కు ఇచ్చి L2, L3 కాంట్రాక్టరుకి 95% వర్కు ఇవ్వటం వెనుకే కుట్ర ఉంది.దానిపై ఏసీబి కేసు నమోదు చేసి, విచారణ జరపాలి. వెంటనే టెండర్ ని రద్దు చేయాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ వరుదు కళ్యాణి హెచ్చరించారు.

కూటమి సర్కార్ ప్రతి పథకంలో స్కామ్ చేస్తోంది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)