Breaking News

‘సమాధానం చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు పారిపోయారు’

Published on Sun, 09/28/2025 - 15:30

తాడేపల్లి : అసెంబ్లీ సమావేశాల నుండి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు, మెడికల్‌ కాలేజీల గురించి అడిగితే అసలు ఆ సమస్యలే లేవని వ్యాఖ్యానించారని స్పష్టం చేశారు. ఈ రోజు(ఆదివారం, సెప్టెంబర్‌ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. రైతులు యూరియా కోసం క్యూ కడుతున్న దృశ్యాలు ప్రభుత్వానికి కనపడలేదని విమర్శించారు. ‘ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు, అచ్చెనాయుడు అంటున్నారు.  

యూరియా అందించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో వ్యవసాయం పండుగైతే చంద్రబాబు హయాంలో దండగగా మారిపోయింది. రైతుల బాధలను కూడా అవహేళన చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆరువేల కోట్లు కూడా ఖర్చు చేయలేక ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెడతారా?, నిధుల్లేకపోతే విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేయొచ్చుకదా?, అదేమీ లేకుండా తమ వారికి దోచి పెట్టటమే పనిగా పెట్టుకుంటారా?, చంద్రబాబు పాలన అంతా ప్రయివేటీకరణ కోసమే. విద్య, వైద్యం ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఇక సామాన్యులు బతికేది ఎలా?, ప్రయివేటీకరణే కరక్టని రోడ్డు మీదకు వచ్చి జనం ముందు చెప్పే ధైర్యం ఉందా?, సూపర్ సిక్స్ మేనిఫెస్టోనే మారిపోయింది. 

ఎన్నికలకు ముందు ఉన్న మేనిఫెస్టోకి, ఇప్పటి మేనిఫెస్టోకి సంబంధం లేకుండా పోయింది. అప్పుల మీద అధికార పార్టీ నేతలు గాలి మాటలు మాట్లాడారు. బాలకృష్ణ తప్పతాగి అసెంబ్లీకి వచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అసెంబ్లీ పరువు తీశారు. మండలి ఛైర్మన్‌కి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. దళితుడన్న కారణంతో అగౌరవంగా చూస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. నారా లోకేష్ సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తూ మిగతా మంత్రుల నోళ్లు మూయించారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వారకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ హెచ్చరించారు. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)