Breaking News

‘వైఎస్‌ జగన్‌ భద్రతపై ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోంది’

Published on Mon, 12/23/2024 - 14:39

సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత గురించి ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి  వైఎస్సార్‌సీపీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. ‘ఎల్లోమీడియా ఏపీలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే వీఐపీల భద్రతను కల్పిస్తారు. కానీ వైఎస్‌ జగన్ భద్రతకు అధికంగా వ్యయం చేస్తున్నట్టు రోత మీడియా రాసింది. 

..సీఎంకి సంబంధించిన భద్రతని ఏ సీఎం కూడా నిర్ణయించుకోరు. ఇంటిలిజెన్స్, పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తీసుకుంటారు. చంద్రబాబు కేవలం 120 మంది మాత్రమే భద్రత అంటూ కథలు రాస్తున్నారు. జగన్‌కు కల్పించిన భద్రత రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సివిల్ పోలీసులు 18 మంది,  ఆర్మడ్ 33 మంది,బెటాలియన్ 89 మంది మాత్రమే ఉన్నారు. బయటకు వెళ్లినప్పడు ఆక్టోపస్ 13 మంది ఉంటారు. మొత్తం 196 మంది వైఎస్‌ జగన్‌కు భద్రత ఉంటారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇదే విధానం అమలు అవుతుంది. కార్యక్రమాలు, తిరిగే ప్రాంతాలను బట్డి అధికారుల నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు  రాస్తోంది.

..చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపటం లేదా?. చంద్రబాబు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ మా గురించి తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు. చంద్రబాబు తన మనమడికి కూడా 4+4 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు?. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు?. తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దు. చంద్రబాబు, వైఎస్‌ జగన్‌లకు ఎంత భద్రత ఉందో అధికారిక రికార్డులను బయట పెట్టాలి. ఆ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా ఉండాల్సిన చంద్రబాబుకు తొత్తుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది’అని విమర్శలు గుప్పించారు. 

వైఎస్ జగన్ పై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)