Breaking News

‘బాబూ.. ఎన్నికల్లో మభ్యపెట్టి ఉద్యోగులు, టీచర్లను మోసం చేస్తారా?’

Published on Sun, 01/11/2026 - 16:02

సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి.. విడుదల చేస్తామని ఇప్పటికీ అందించలేదన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులను మభ్యపెట్టి.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో దోహదం చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం.. వారికి డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి విడుదల చేస్తామని‌ ఇప్పటికీ అందించడం లేదు. వైఎస్ జగన్ హయాంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శత్రువుగా మారిపోయింది. టీచర్స్ పట్ల టార్చర్, పోలీసులకు పనిష్మెంట్, సచివాలయంలో లక్ష సమస్యలుగా కూటమి ప్రభుత్వం మారింది.

ఉద్యోగులకు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా తుంగలో తొక్కారు. రూ.34వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ అందిస్తామని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పీఆర్సీ ఇస్తామని ఆ ఊసే లేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రస్తావించడం లేదు. పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేయకుండా మభ్యపెడుతున్నారు.

గతంలో వైఎస్ జగన్ హయాంలో ఐఆర్ 27 శాతం అందించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి కేబినెట్‌ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకోని ఉద్యోగులకు అందించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. 16 నెలలు అవుతున్నా డీఏలు అందించడం లేదు. వైఎస్‌ జగన్‌ కరోనా సమయంలో కూడా ఐఆర్, డీఏలు, పీఆర్సీ అందించారు. మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగులకు ఎందుకు బకాయిలు చెల్లించలేదు?. సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో‌ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అని కామెంట్స్‌ చేశారు. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)