YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి
Breaking News
తనకు బలం లేదని పవన్ కల్యాణే ఒప్పుకున్నారు:మిథున్‌రెడ్డి
Published on Sun, 07/09/2023 - 12:39
కాకినాడ: టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే జనసేన నేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మిథున్రెడ్డిఅన్నారు. ముఖ్యమంత్రిని కానని గతంలో పవన్ చెప్పారని, అంత బలం తనకు లేదని స్వయంగా పవన్ చెప్పిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు.
ప్రజలతో నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే తమవల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడ వైఎస్సార్సీపీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వనిస్తామన్నారు.
ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, వారే తమ పార్టీ అభ్యర్ధులని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టాప్ ప్రయారిటీ ఉంటుందని మిథున్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: సీఎం జగన్
Tags : 1