అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన: మహేష్ రెడ్డి
Published on Sat, 06/28/2025 - 13:12
సాక్షి, నరసరావుపేట: కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది అని ఆరోపించారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడేది లేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీ మొత్తం చంద్రబాబు ఫ్యాక్షనిజం నడుపుతున్నారు. నిన్నటి ఓటమి రేపటి గెలుపునకు నాంది కావాలి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే భయమెందుకు?. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది. వైఎస్ జగన్ తొమ్మిది కార్లు, వంద మందితో వెళ్లాలట!. అనైతిక రాజకీయ ఒరవడికి కూటమి ప్రభుత్వం నాంది. భూస్థాపితం చేస్తారా?. ఎలా చేస్తారు?. ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై, కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు
చిన్న పాపను 14 మంది అత్యాచారం చేస్తే వారిని ఎన్కౌంటర్ చేయాలి కదా?. తెనాలిలో యువకుల్ని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుంటే వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించడం తప్పా?. కుప్పం నియోజకవర్గం ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే మీరు ఏం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యురిటీ ఇవ్వకపోవడం వల్లనే సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వైఎస్ జగన్ 2010లో పార్టీ పెట్టిన అప్పటి నుండి చంద్రబాబు.. వైఎస్ జగన్ని తొక్కాలని చూస్తున్నాడు. అందుకే అనైతిక పొత్తులు పెట్టుకున్నారు.. కానీ, విఫలం అయ్యారు.
ఎన్నికల్లో మహిళలకు నెలకు 1500 ఇస్తా అన్నారు అది నమ్మి మహిళలందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు మొదలు అవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ఆసుపత్రులకు ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. పల్నాడులో మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయడం లేదు. అందుకే మేము సెల్ఫీ వీడియోతో నిరసన తెలియజేసాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు పెట్టే కేసులకు భయపడేది లేదు. ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని తెలిపారు.
Tags : 1