Breaking News

‘చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు’

Published on Sat, 04/19/2025 - 13:28

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్‌ మేయర్‌ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ మేయర్‌ పీఠం కూటమి గెలుపుపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..‘యాదవ మహిళకు వైఎస్‌ జగన్‌ మేయర్‌ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్‌ మేయర్‌ పీఠం కైవసం చేసుకుంది. పార్టీ మారని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావుబతుకుల మధ్య కూటమి సర్కార్‌ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేం ప్రలోభపెట్టలేదు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయింది. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మాన లేఖ ఇచ్చారు. ధర్మం గెలిచిదంటున్న కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదు. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత  లేని వ్యక్తి చంద్రబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్‌..

  • బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు..
  • ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు.
  • మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు.
  • విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం కాదు..
  • యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చారు..
  • ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారు.
  • 99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారు.
  • ఇదే తరహాలో భూములు కట్టబెడతామని లోకేష్ చెప్తున్నారు..
  • టీసీఎస్ విశాఖ రాక ముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు.
  • విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలని చూస్తున్నారు.

ధర్మశ్రీ పాయింట్స్ కామెంట్స్‌..

  • మేయర్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ నైతికంగా గెలిచింది..
  • కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు..
  • జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు..
  • యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు..

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా?.
  • చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు..
  • ప్రజలు 164 సీట్లు ఇచ్చిన  చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు..
  • వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.
  • చంద్రబాబు ప్రలోభాలకు పెట్టింది పేరు
  • న్యాయం ధర్మం గెలిచిందని కూటమి నేతలు మాట్లాడడం సిగ్గుచేటు.
  • కుట్రలు తంత్రాలకు మేయర్ ఎన్నికలో గెలిచాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)