Breaking News

అంబేద్కర్‌ విగ్రహాన్ని కూటమి సర్కార్‌ కూల్చే అవకాశముంది: మేరుగు నాగార్జున

Published on Fri, 08/09/2024 - 16:37

సాక్షి, తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున.  అంబేద్కర్‌ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘భావితరాలకు దికూచ్చిగా ఉండాలని అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేశారు. గతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడలో అంబ్కేదర్‌ విగ్రహంపై దాడికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్‌ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది.  ఇక్కడ అంబేద్కర్‌ వి​గ్రహం ఉండకూడదనే దాడి చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇదే సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ మాట్లాడుతూ..‘ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేశారు. ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తు​న్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కమిటీలు వేస్తామని కథలు చెబుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ప్రభుత్వమే ఈ దాడి చేయించిందనే అనుమానం కలుగుతోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు. విగ్రహం వద్ద వైఎస్‌ జగన్‌ పేరుని తొలగించవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరును తొలగించలేరు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గరలోనే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు?. సామాజిక న్యాయం కోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. కూటమి నేతలకు సామాజిక న్యాయం అంటే పట్టదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇక, ఇదే ఘటనపై తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం వద్ద దాడిని ఖండిస్తున్నాను. అన్ని జాతులకు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరాధ్యదైవంగా అంబేద్కర్‌ను భావిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి.  లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దేశానికే ఆదర్శంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి అని కామెంట్స్‌ చేశారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)