Breaking News

అశోక్‌బాబుపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన వైయస్సార్‌సీపీ

Published on Fri, 08/01/2025 - 22:34

తాడేపల్లి: వైయస్సార్‌సీపీ దళిత నేత వరికూటి అశోక్‌బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం. 

రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్‌ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.

రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్‌బాబును దారుణంగా పోలీస్‌ స్టేషన్‌కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. 

రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్‌సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)