Breaking News

‘పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’

Published on Tue, 02/03/2026 - 13:38

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతల సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం’ అని టీడీపీ నేతలు మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన విడదల రజిని.. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం అని  ఎమ్మెల్యే మాధవి బెదిరిస్తున్నారు. ఆమెను టీడీపీ బలిపశువు చేస్తోందని గుర్తుంచుకుంటే మంచిది. మహిళా పక్షపాతి లాగ తెగ బిల్డప్‌లు ఇస్తారు.. మళ్లీ మీరే దాడులు చేస్తారు.

కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. లడ్డూ ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు. మాపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తే.. కనీసం స్పందన లేదు. కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుడికెళ్లి మొక్కుకుంటే తప్పా. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. వైఎ‍స్సార్‌సీపీ వాళ్లు ఏ గుడికి వెళ్లొద్దని చట్టం చేయండి. 

తిరుమల లడ్డూ వ్యవహారంలో జరగని కల్తీని జరిగినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. మేము కూటమి నేతలను నిలదీస్తున్నామనే మాపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రాష్ట్రంలో రాజ్యాంగం లేదు.. ప్రజాస్వామ్యం లేదు.. శాంతి భద్రతలు లేవు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలసీ, రెడ్‌బుక్‌ పాలన నడుస్తోంది. రెడ్‌బుక్‌ అరాచకంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీరెన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.

Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)