Breaking News

ఖనిజ సంపద దోపిడీకి బాబు స్కెచ్‌

Published on Tue, 10/15/2024 - 03:22

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపద దోపిడీకి మాస్టర్‌ స్కెచ్‌ వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌­బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఇసుక దోపిడీని వ్యవస్థీకృతం చేసి ప్రత్యక్ష దోపిడీకి దిగారని ధ్వజమెత్తారు. సోమ­వారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రజలంతా దసరా సందడిలో ఉంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని చెప్పారు. ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్‌ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ.. దోపిడీకి తెరలేపిందన్నారు.

ఆ బిడ్‌ల వెనుక మర్మమేమిటి? 
టన్ను ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120గా బేస్‌ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ.50 నుంచి రూ.60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుక మర్మమేంటని టీజేఆర్‌ నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 రీచ్‌లకు 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్‌లు స్వీకరించి ఖరారు చేసేశారని, కర్నూలులో అసలు నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ఒకే టెండర్‌ వస్తే బిడ్‌ను ఆమోదించారన్నారు.

వైఎస్సార్, పల్నాడు, ఉభయ గోదా­వరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చిత్తూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బీజేపీ, జనేసేన నేతలతో కలసి టీడీపీ నాయకులు బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని, లేకుంటే  ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి