Breaking News

‘రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ చేపట్టారో చంద్రబాబు చెప్పాలి’’

Published on Fri, 07/18/2025 - 20:47

కర్నూలు జిల్లా:  16 ఏళ్ల పాటు సీఎంగా ఉండి రాయలసీమలో ఏ ప్రాజెక్ట్‌ చేపట్టారో చంద్రబాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంతో అనుభవం ఉ‍న్న నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టులు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు.  ఎన్టీఆర్‌ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించగా, ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.  1998లో జీవో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించలేమని చెప్పి.. కేవలం త్రాగునీటి కోసం ఈ ప్రాజెక్టును వాడుకోవాలని జీవో విడుదల చేశారన్నారు. 

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయ్యాక ఎన్టీఆర్‌ చేపట్టిన తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసి హంద్రీనీవా ప్రాజెక్ట్‌ నుంచి 40 టీఎంసీలు తీసుకోవాలని రెండు ఫేస్‌లుగా విభజించారన్నారు. అనంతపురం కరువు నుంచి బయట పడింది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవేనని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ద్వారా కియా పరిశ్రమకు నీరు అందుతున్నదని,  ఇప్పుడు వైఎస్సార్‌ పేరు చెప్పకుండా తానే మొత్తం చేస్తున్న అని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో వైఎస్సార్‌ పని చేశారని, 98లో మీరు ఇచ్చిన జీవో, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో గురించి చర్చించడానికి మీరు, మీ నాయకులు సిద్ధమా? అని శ్రీకాంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.  

చంద్రబాబుకు చిత్త శుద్ధి ఉంటే గుండ్రేవుల, వేదవతి, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తామని చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని మాట్లాడుతున్న చంద్రబాబు.. కర్నూలులో హైకోర్టు ఎందుకు వద్దన్నారని, ఇక్కడ ఉన్న లా యూనివర్సిటీ ఎందుకు తరలించారని ప్రశ్నించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)