Breaking News

కూటమి నేతల్లో క్రెడిబులిటీ లేదు : శ్యామల

Published on Fri, 03/07/2025 - 17:29

సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం (మార్చి7) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

‘వైఎస్సార్‌సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు.

కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,809 కేసులు  నమోదయ్యాయని హోంమంత్రి ప్రకటించారు. వాటిల్లో ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేశారు?. మచ్చుమర్రి, గుడ్లవల్లేరు ఘటనలు ప్రభుత్వ ఉదాసీనకు అద్దం పట్టాయి.పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్‌ జగన్ పాలనలోనే.  ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్‌ జగన్‌ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది. 

ఎవరూ అడగకుండానే జగన్ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు.జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సగానికిపైగా మహిళలకే కేటాయించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారా?.సూపర్ సిక్స్ హామీలన్నీ మోసం మోసం. ఉచిత బస్సు పథకంపై నిలువునా మోసం చేశారు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ద్వారా తిరగవచ్చని చంద్రబాబు చెబితే జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు’అని అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)