Breaking News

‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చిన్నచూపు’

Published on Sun, 02/22/2026 - 17:34

కర్నూలు: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీమ ప్రాజెక్టులకు సంబంధించి ఏమి చేశారో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి చంద్రబాబు నిలిపి వేశారని, ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడటం లేదని, సీమకు ద్రోహం చేసేందుకు చంద్రబాబు 20 టీఎంసీల నీటిని తాకట్టు పెట్టారన్నారు. 

‘వైఎస్సార్‌ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ మేలు చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీమ ప్రజల కోసం ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు చూపుతో సీమలోని ప్రాజెక్టులకు నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకున్నారు.

కృష్ణా నదిలో ప్రవాహం లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రోజుకు 6 టిఎంసి నీటిని వాడుకుంటుంది. ఇలాంటి చర్యలు జరగకుండా సీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణానది లో ప్రవాహం లేకుంటే సీమ ఎడారిగా మారుతుంది అలా కాకుండా సీమ ఎత్తిపోతల పథకం వైఎస్ జగన్ తీసుకొచ్చారు. గుండ్రేవుల రిజర్వాయర్ 2029 ఎన్నికల అనంతరం వాటి పూర్తి చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు.  వైఎస్ జగన్ పాలనలో పులివెందులలో ఎలాంటి మతపరమైన రాజకీయాలు చేయలేదు. ప్రతి గుడికి జగన్ డబ్బులు చెల్లించారు. పులివెందులలోని ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి సిజిఎఫ్ నిధులను కేటాయించారు. చంద్రబాబు ఇప్పటికైనా వైఎస్ జగన్ కంటే మెరుగైన పాలన అందించాలి

కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు పాలన అంతా లడ్డు రాజకీయాలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. చంద్రబాబు కుప్పంలో ఎన్ని గుడిలకు నిర్మించారో చెప్పాలి. అలీ బాబా అరడజన్ దొంగ తరహాలో రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలన పూర్తి గా విఫలం చెందింది. రీల్స్ మాత్రమే నారా లోకేష్‌ పరిమితం అయ్యారు. కానీ పనులు చేయడం లేదు. ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని హెచ్చరించారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)