Breaking News

‘ఆమె రాజకీయాలు కాంగ్రెస్ కోసమా?, బాబు కోసమా?’

Published on Fri, 04/04/2025 - 20:22

తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్.   వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పీసీసీ అధ్యక్షురాలిగా ఉ‍న్న వైఎస్ షర్మిలతో ాట్లాడిస్తున్నారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తేవడం చంద్రబాబుకి అలవాటని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, డైవర్షన్‌ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్లో ఆమె ఒక భాగంగా మారారన్నారు.

‘ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్‌ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా  షర్మిలను రంగంలోకి దిగారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విజయవాడ వరదలు అంశం అయినా, తిరుపతి లడ్డూ విషయం అయినా, ఇప్పుడు వక్ఫ్‌ బిల్లు విషయం అయినా ఇలా చంద్రబాబుగారి ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్ట్‌ చేయడానికి షర్మిళగారు రావడం, ప్రెస్‌మీట్లు పెట్టడం అన్నది ఒక రివాజుగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రభుత్వంలో ఉన్నవారిని నిలదీయాలి, ప్రజల తరఫున ప్రజా సమస్యలపై వారిని ప్రశ్నించాలి. కాని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షంలో ఉన్నవారిని నిలదీస్తూ ఒక ప్రతిపక్షానికి చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షురాలైన షర్మిల రాజకీయాలు చేస్తున్నట్లుంది. రాజకీయాల్లో ఇది వింతగా ఉంది. చంద్రబాబు ఎప్పుడు డైవర్షన్‌ కావాలనుకుంటే అప్పుడు ఆమె రంగంలోకి దించుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం చేస్తున్నారన్నదానిపైనే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.మరి ఆమె చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీ కోసమా? లేక చంద్రబాబుకోసమా?

గత ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. వారికి సంబంధించిన మాధ్యమాల్లో వారు చెప్పినట్టుగానే మాట్లాడారు. ఆమేరకే నడుచుకున్నారు. ఇక్కడే షర్మిల అసలు ఉద్దేశాలు బయటపడ్డాయి’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)