Breaking News

‘మీకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారు?’

Published on Tue, 02/24/2026 - 19:17

తాడేపల్లి:  కూటమి నేతలకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలకు దేవుడంటే నమ్మకం ఉందని ఎలా అనుకోవాలన్నారు. 

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే  బరితెగించి మరీ మాట్లాడారని, పవన్‌ పని గట్టుకుని తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇదంతా చూస్తుంటే దేవుడంటే భయలేకుండా బరితెగించి మాట్లాడమేనని పేర్ని నాని ధ్వజమెత్తారు. 

ఈరోజు(‍మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ క్లియర్‌గా చెప్పింది. అయినా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌, లోకేష్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 

పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

  • బందిపోట్లకు మించిన ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
  • తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు ఉందంటూ ఈరోజు కూడా మాట్లాడారు
  • ఇంతకు మించిన బరితెగింపు లేదు
  • తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు చేశారు
  • చంద్రబాబుకు దేవుని‌మీద భక్తి, భయం ఏదీ లేదు
  • అందుకే విజయవాడలో అనేక ఆలయాలను చంద్రబాబు కూల్చారు
  • ప్రసిద్ధ కాశీనాయన క్రేత్రంలో సత్రాలను కూల్చింది కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వమే
  • కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?
  • పవన్ మంత్రిత్వ శాఖ అధికారులే సత్రాన్ని కూల్చారు
  • పవన్ ఆదేశాలు లేకుండా కూల్చటం సాధ్యం అవుతుందా?
  • సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించలేదా?
  • ఇది నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కాదా?
  • తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే బాధ్యత లేదా?
  • తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిందెవరు?
  • గోదావరి పుష్కరాలలో 29 మంది చావుకు కారణం ఎవరు?
  • తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిందెవరు?
  • ఈ పాపాలన్నీ చేసింది చంద్రబాబే
  • అలాంటి చంద్రబాబు.. జగన్ మీద విషం కక్కుతారా?
  • రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి చంద్రబాబు డబ్బులు ఇచ్చారు
  • పెంటపాడులో రథాన్ని తగులపెడితే ఎందుకు నిర్మాణం చేయలేదు?
  • అంతర్వేదిలో రథం తగుల పడితే కోటి ఖర్చుతో జగన్ హయాంలో కొత్తది నిర్మించారు
  • రామతీర్థంలో రూ.3 కోట్లతో రాతి నిర్మాణంతో ఆలయాన్ని జగనే నిర్మించారు
  • చంద్రబాబు హయాంలో కూలదోసిన విజయవాడ ఆలయాలను కూడా జగనే నిర్మించారు
  • కొన్ని వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను జగనే నిర్మించారు
  • తిరుమలలో శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తానన్న చంద్రబాబు, పవన్ ఇప్పుడు కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు?
  • చంద్రబాబుకు దమ్ముంటే తిరుమలలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయగలరా?
  • గదులు తీసుకోవాలన్నా లంచాలు ముట్టచెప్పాల్సిందే
  • కొండ మీద అవినీతి జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారు?
  • జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టు కింద 5,263 పనులు ఆలయాల్లో చేసినమాట నిజం కాదా?
  • రెండో సంతకంతో నియమించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు ఎందుకు కనపడటం లేదు?
  • తిరుమల నుండి జీఏడీలోకి ఎందుకు పంపారు?
  • జులైలో నెయ్యి శాంపిల్స్ తీసి నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపారు
  • ల్యాబు రిపోర్టు ప్రకారం కల్తీ కలిశాయని వెనక్కు పంపారు
  • అవి రాఘవేంద్ర క్రషర్ దగ్గర పార్క్ చేశారు
  • ఆ ట్యాంకర్లను మళ్ళీ వైష్ణవి డెయిరీ పేరుతో కొండ మీదకు పంపారు
  • చంద్రబాబు కూటమి ప్రభుత్వమే ఈ పాపపు పని చేసి, జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేశారు
  • వైష్ణవి, బోలేబాబా డెయిరీలు ఎవరివి?
  • పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరూ బోలేబాబా, వైష్ణవి డెయిరీలకి ఓనర్లు
  • టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డెయిరీకి ఉన్న సంబంధం ఏంటి?
  • పొమిల్ జైన్, విపుల్ జైన్ లకు హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయి
  • ఏఆర్ డెయిరీ ఓనర్ రాజురాజశేఖర్‌తో చంద్రబాబుకు సంబంధం ఉందా లేదా?
  • దిండిగల్ లో హెరిటేజ్ ఫ్యాక్టరీని కట్టించింది ఎవరో చంద్రబాబుకు గుర్తుందా?
  • జగన్ హయాంలో నిబంధనలు మార్చారంటున్న చంద్రబాబు.. మరి ఇప్పటికీ దాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు?
  • పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పార్థసారథి, ప్రశాంతిరెడ్డి రికమెండేషన్ చేశారు
  • వారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నారు
  • 2022 లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణలు చేశారు
  • ఆ రిపోర్టును పైవారికి పంపకుండా కింద వారు తొక్కి పెట్టారని సీబిఐ చెప్పిందా లేదా?
  • ఆల్ఫా, మాల్ గంగా, ప్రీమియర్ డెయిరీలు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటున్న చంద్రబాబు మరి అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు కొనసాగించారు?

 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)