Breaking News

పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా?: మార్గాని భరత్‌

Published on Sat, 11/16/2024 - 15:39

సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు  పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం(నవంబర్‌ 16) రాజమండ్రిలో మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడారు.

‘రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా?విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు.

ఐదు నెలల్లో రూ.57వేల కోట అప్పులు చంద్రబాబు చేశారు.ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీడీపీ చెప్పిన అబద్ధాలు స్పష్టమయ్యాయి. గతంలో వైఎస్‌జగన్‌ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి రూ.11వేల కోట్లు ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్చగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక పాలసీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించేది. ఈనాడులో నిస్సిగ్గుగా వైఎస్‌జగన్‌ కుటుంబ సభ్యులపై వార్తలు రాయడం దారుణం. మనుషుల క్యారెక్టర్‌ను  అసాసినేట్ చేసే విధంగా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు’అని మార్గాని భరత్ పేర్కొన్నారు.

Bharath: సంపద సృష్టించడం అంటే ఐదు నెలల్లో 57 వేల కోట్లు అప్పు చేయడమా...?

ఇదీ చదవండి: బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)