Breaking News

‘కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైంది’

Published on Mon, 04/21/2025 - 17:32

తాడేపల్లి :  కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కరువైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు.. ‘హిందూధర్మంపై నిత్యం దాడి జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తిరుమల లడ్డూ గురించి విషప్రచారం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా ఆరుగురు భక్తుల మరణానికి కారకులయ్యారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి

తాబేళ్ల సంరక్షనే కాదు, పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మా హయాంలో ఏ పొరపాట్లు జరగకపోయినా ఏదో జరిగినట్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు?, కాశీనాయన క్షేత్రంలో అధికారులే వెళ్లి నిర్మాణాలను కూల్చేస్తే ఎందుకు మాట్లాడలేదు?, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోంది?

రెండు వందల తాబేళ్ల పరిరక్షణ కూడా ప్రభుత్వానికి పట్టదా? , మా హయాంలో ప్రతి తాబేలుకూ నెంబర్ ఇచ్చి వాటి పరిరక్షణ చూశాం. కానీ ఈ ప్రభుత్వం తాబేళ్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా ఎలా దహనం చేస్తారు?, అసలు రాష్ట్రంలో హిందూ ధర్మం ఏమవుతోంది? , వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. శ్రీకూర్మం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు

శ్రీకూర్మనాథ ఆలయంలో జరిగిన ఘటన బాధ్యతారాహిత్యం

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)