Breaking News

‘ఇది సుపరిపాలన కాదు.. అరాచక పాలన’

Published on Sat, 07/19/2025 - 21:27

విజయవాడ:  ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని  ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు. ఈరోజు(శనివారం, జూలై 19) విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం సత్యనారాయణపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణుతో పాటు వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ వైలజారెడ్డి తదితరులు పాల్లొన్నారు. 

దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘టిడిపి కక్షపూరిత పాలన చేస్తోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసును తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్టు చేయాలని చూస్తున్నారు. అరెస్టులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడేది లేదు. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరక టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళతాం. 

సుపరిపాలన పేరుతో ప్రజల ముందుకు వెళ్లిన టీడీపీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట తప్పింది. ఇదేనా సుపరిపాలనా అంటే?, ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి. వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన త్వరలోనే రానుంది’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)