Breaking News

‘ఒక్క డీఏ ప్రకటించి పండగ చేసుకోమంటున్నారు’

Published on Sun, 10/19/2025 - 18:56

కాకినాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను డీఏ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉద్యోగులకు డీఏ పేరుతో ప్రచారం సాగిందని,  అయితే చివరకు ఒక్క డీఏని ప్రకటించి పండుగ చేసుకోమంటున్నారని కురసాల మండిపడ్డారు. 

‘ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క డిఎ ప్రకటించారు. దీంతో పండుగ చేసుకోమంటున్నారు.లెక్కప్రకారం నాలుగు డీఏలు ఇవ్వాలి,. ఒక్కసారి క్షేత్ర స్ధాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో మోసం చేసి ముంచేశాడు. ఫీజు రియింబర్మెంట్ చెల్లించకుండా విద్యార్ధులను మోసం చేశాడు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన నాడు-నేడును చంద్రబాబు నీరుగార్చేశారు. 

వారం రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేశారు‌. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు‌. పీహెచ్‌సీ వైద్యులు సమ్మె చేస్తున్నా...వారితో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాడం లేదు. చంద్రబాబు మారేడేమో అని ఉద్యోగులు అనుకున్నారు. ఉద్యోగుల డిఎ విషయంలో పెద్ద హైడ్రామా చేసే ప్రభుత్వం ఏదీ ఉండదేమో.. 16 నెలల్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. మసిబూసి మారేడు కాయ చేసి రాష్ట్రంలో ఏదో గొప్పగా జరిగిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు‌. ఓపిఎస్ నే అమలు చేస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు లో ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏలాంటి అలవెన్సులు,బకాయిలు చెల్లించారు.

పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ‌.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు..ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు.

ఆర్టీసిని ప్రభుత్వంలో  విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్‌లో 18 వేల ఉద్యోగులను తొలగించారు‌. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు‌. 

ఆబ్కాస్‌ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్ధలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.’ అని కురసాల తెలిపారు.

ఇదీ చదవండి:
‘లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)