Breaking News

‘స్ధానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్ జగన్ ’

Published on Fri, 11/07/2025 - 14:59

కాకినాడ: ‘విజన్‌ యూనిట్‌’ అంటూ సచివాలయాల పేరును మార్చాలనుకుంటున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేరు మార్చవచ్చేమో కానీ వ్యవస్థను సృష్టించిన వాళ్లను మార్చలేరంటూ ధ్వజమెత్తారు.  స్ధానిక స్వపరిపాలన,ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సిఎం వైఎస్ జగన్ అని, స్ధానిక స్వపరిపాలనకు వైఎస్ జగన్ మార్గదర్శి అని స్పష్టం చేశారు కురసాల.

ఈరోజు(శుక్రవారం, నవంబర్‌ 7వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘తుపాన్ భాధితుల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఐతే కొన్ని  పేపర్‌లు చూస్తే డేటా ఆధారిత సెంటర్లు అని రాసి ఉన్నాయి. తుపాను తర్వాత చంద్రబాబు లండన్‌ వెళ్లిపోతే..  మంత్రి లోకేష్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూడటానికి ముంబై వెళ్లిపోయాడన్నారు. లండన్ బాబు వచ్చి డేటా ఆధారిత పరిపాలన కోసం మాట్లాడుతున్నారు.  తుపాన్ వల్ల ఎంత పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? ఎన్ని రోడ్లు పోయాయంటే డేటా లేదు.

స్ధానిక స్వపరిపాలన , ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. విజన్ యూనిట్ అని సచివాలయాల పేరు మార్చాలనుకున్నారు. పేరు మార్చవచ్చేమో కానీ...  వ్యవస్ధలను సృష్టించిన వాళ్ళను మార్చలేరు‌. *హెడ్ లై‌న్లు..అందమైన ఫోటోలకు తప్పా... నిన్న ఏం చేశాం అనే దానిపై ఫాలోఫ్ ఉంటుందా?, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం అని చంద్రబాబు చెబుతున్నారు.. గత 16 నెలలుగా ఏం చేశారు?, ప్రభుత్వ మద్యానికి సమాంతరంగా నకిలీ మద్యాన్ని తీసుకువచ్చారు.

మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయో మీరే నమ్మట్లేదు. నకిలీ మద్యాన్ని అమ్మడం వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయి. చాలా గందరగోళం లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సచివాలయాలను విజన్ యూనిట్ అని చంద్రబాబు అంటున్నారు కధా? ఎవరూ విజనరీనో చంద్రబాబు చెప్పాలి. వాట్సప్ లో సేవలు అందుతున్నప్పుడు ..లోకేష్ దగ్గరికి, కలెక్టరేట్ లకు ఎందుకు ప్రజలు తమ అర్జీలను తీసుకువెళ్తున్నారు’ అని కురసాల ప్రశ్నించారు.

 

బండి సంజయ్‌కు నో.. కేటీఆర్‌ ఓకే

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)