‘టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట’

Published on Tue, 08/27/2024 - 17:45

పల్నాడు జిల్లా :  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించడం లేదని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళకు అన్యాయం చేశారని కాసు మహేష్‌ రెడ్డి మండిపడ్డారు.

రేషన్‌ షాపు వ్యవహారంలో మనీషా అనే యువతిని టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్‌షాపును మనీషా అనే యువతి చూసుకుంటుంటే ఆమెపై టీడీపీ వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్‌ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారని, రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని టీడీపీ నేతలు వేధించారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట అని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు.

ఆడ పడుచులను మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు దిగుతుందన్నారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రేపు, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్తామని, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)