Breaking News

రామగిరి ఎస్‌ఐ పనులకు పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి: గోరంట్ల మాధవ్‌

Published on Thu, 04/10/2025 - 16:29

సాక్షి, తాడేపల్లి: అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత వైఎస్‌ జగన్ అని.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా ఆయనేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌కు మూడంచెల భద్రత అవసరం. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే’’ అని మాధవ్‌ అన్నారు.

‘‘రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్‌గా కనిపించింది. హోంమంత్రి అనిత మాత్రం జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారు. ఆ 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారు. హెలికాఫ్టర్‌ను ఇబ్బందులకు గురిచేసి మార్గమధ్యలో ఆయనపై దాడి చేయాలని కుట్ర పన్నారు. మంత్రి నారా లోకేష్‌కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారు. జగన్‌కు పూర్తిస్థాయి రక్షణ బాధ్యత పోలీసులదే’’ అని గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు.

‘‘రామగిరిలో ముత్యాలు అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరిగిన సమయంలో నేనే పోలీసులకు సమాచారం ఇచ్చా. ఘటన సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు కింద పడ్డ రాళ్లను తమ వాహనంలో వేసుకుని వెళ్లారు. రామగిరి ఎస్‌ఐ.. బాధితుల వాహనాల్లో కత్తులు పెట్టి తిరిగి అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్లింది. రామగిరి ఎస్‌ఐ పనులకు పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం హాస్యాస్పదం’’ అని గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)