Breaking News

‘భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ ఎవరు చేశారు?’

Published on Fri, 07/31/2026 - 18:10

విశాఖ: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్‌ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్‌ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు. 

ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన బొత్స..  అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్‌ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు. 

‘2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?,  15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి.  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్‌ జగనే చేశారు’ అని స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)