Breaking News

స్టీల్‌ ప్లాంట్‌ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ

Published on Sun, 01/19/2025 - 18:10

సాక్షి,విశాఖపట్నం:స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్‌షా, సీఎం చంద్రబాబు  ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.

కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా  కేసు నమోదు చేయాలి. స్టీల్‌ప్లాంట్‌ను  సెయిల్‌లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్‌ జగన్‌కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)