Breaking News

దీక్ష విరమించిన వైఎస్సార్‌సీపీ నేత అశోక్‌బాబు

Published on Sun, 06/30/2024 - 16:29

సాక్షి, బాపట్ల జిల్లా: చెరుకుపల్లిలో దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్ బాబుకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌ సంఘీభావం తెలిపారు. అద్దేపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని వీడియో కాల్‌లో అశోక్ బాబుకు నందిగం సురేష్‌ చూపించారు. 24 గంటల్లో ఎక్కడైతే వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడే కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అశోక్ బాబుకి మాజీ ఎంపీ నందిగం సురేష్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరంపజేశారు.

కాగా భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్‌ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్‌ మరో విగ్రహం ఏర్పా­టుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పా­టు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌన­దీక్ష చేశారు.

దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌­బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తర­లించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగించారు.

 



 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)