Breaking News

‘మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’

Published on Tue, 05/27/2025 - 15:48

ప్రకాశం జిల్లా:  తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ నేత,  మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు ఆదిమూలపు.

ఈ మేరకు మంగళవారం మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘దళిత యువకులపై పోలీసులు పాశవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రెడ్ బుక్ ర్యాజ్యాగం శ్రుతిమించి అమలు చేస్తున్నారు. నడిరోడ్డు పై కర్రలు విరిగే దాకా పోలీసులు కొట్టడం చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఆత్మగౌరవం దెబ్బతినేలా, సభ్య సమాజం తలదుంచుకునేలా పోలీసులు తీరు ఉంది. 

తెనాలి ఘటనపై హోంమంత్రి బాధ్యత వహించాలి. తక్షణమే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలి.  ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ను, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం. కూటమి ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు. పోలీస్ స్టేషన్ లు ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయి’ అని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్.

కాగా, ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కశంగా లాఠీలతో చితకబాదారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)