Breaking News

క్లీన్‌ స్వీపే లక్ష్యం

Published on Tue, 02/27/2024 - 02:57

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించా­ల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంగళవారం దిశా­నిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం మంగళగి­రిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వ­హిస్తు­న్నారు.

ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వ­యక­ర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమ­న్వయ­కర్తలు, నియోజకవర్గ పరిశీల­కులు, మండల పార్టీ అధ్య­క్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచి­వా­లయ కన్వీనర్లు సహా 2,700 మందికిపైగా నేత­లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నిక­ల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారు. సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సమావేశం ఏర్పాట్లను సోమవారం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతరులు కూడా ఉన్నారు.

ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ దూకుడు
రాష్ట్రంలో గత 58 నెలలుగా రాష్ట్రంలోని ప్రతి పేదింటి భవిష్యత్తును గొప్పగా మార్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ సుపరిపాలన అందిస్తుండటంతో వైఎస్సార్‌­సీపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. సుపరిపాలన వల్ల ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పి­స్తు­న్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్‌ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని 2022 మే 11న ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

అప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల శంఖం పూరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందు­లూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒక­దానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజాక్షే­త్రంలో దూకుడు మరింత పెంచాయి. వచ్చే నెల  3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికలగుడిపాడు ‘సిద్ధం’ చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి­న­ప్పటి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్య­క­ర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గత 58 నెల­లుగా సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రతి గడపకూ తీసు­కెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 175 స్థానా­ల్లో విజయమే లక్ష్యంగా మేం సమర్థవంతమైన టీమ్‌ను సిద్ధం చేసుకున్నాం. ఆత్మ­విశ్వాసంతో ముందు­­కెళ్తున్నాం.

ప్రభుత్వం చేసి­న మంచిని మరింత సమర్థవంతంగా ప్రజల్లో­కి తీసు­కెళ్ల­డం, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పి­కొ­ట్ట­డం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేప­ట్టా­ల్సిన చర్యలపై మంగళవారం నిర్వహించే కీలక సమావేశంలో నేతలకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారు. మేం సమన్వయ­కర్తలను నియమించేటప్పుడు ఏదో జరిగిపో­తు­న్న­ట్లుగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ.. సీఎం వైఎస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులన్నీ ఏకతా­టి­పై­కి వచ్చా­యి. టీడీపీ–జనసేన కూటమి అతు­కు­ల­బొంత అని సీట్ల సర్దుబాటులోనే స్పష్ట­మై­ంది.

పవన్‌­ను అనుసరిస్తున్న శ్రేణుల­ను ఘోర­ంగా అవ­మా­నిస్తూ చంద్రబాబు జన­సే­నకు 24 సీట్లు పడేశారు. ఆ రెండు పార్టీల్లో అసంత్పప్తి పెల్లు­బు­కుతోంది. టీడీపీ, జనసేన అసంతృప్త నేతలు గంపగుత్తగా వైఎస్సా­ర్‌సీ­పీలో చేరుతా­మంటున్నారు. కానీ.. మేం ఎవ­రిని పడితే వారిని చేర్చుకోం. వారి వల్ల అనవసరమైన తలనొప్పులు. అవకాశం ఉన్న చోట మాత్రమే ఆ పార్టీల నేతలను చేర్చుకుంటాం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)