Breaking News

బాబూ.. వరద సంక్షోభం నుంచి సంపద సృష్టించుకున్నారా?: కన్నబాబు

Published on Tue, 10/08/2024 - 15:45

సాక్షి, కాకినాడ: విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు. దాతల నుండి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు.

మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వరదలను చంద్రబాబు పండుగ చేసుకున్నారు. సంక్షోభం నుండి సంపద సృష్టించినట్లు ఉంది. సకాలంలో వరద సహయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి అసలు స్వరూపం ఏమిటో బయట పడింది‌. ప్రజలు ఏమనుకుంటారో అని సిగ్గులేకుండా ప్రభుత్వం ఉంది. వినాయక చవితి, దసరా చందాలు వసూలు చేసినట్లు చంద్రబాబు వరదలకు సహాయం వసూలు చేశాడు. రూ.368 కోట్లతో ఎంత మందికి భోజనాలు పెట్టారు.

కృష్ణా, గోదావరి వరదలకే చంద్రబాబు హడావిడి చేశాడు. కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు రూ.28 కోట్లు ఖర్చు చేశారా?. డ్రోన్లకు రూ.2కోట్లు ఖర్చు చేశారంట. చంద్రబాబు సర్కార్‌కు వరదొచ్చినా.. కరువొచ్చినా పండుగే. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్న కూటమి నేతలు చెబుతున్నారు. వరద లెక్కలకు తేడా చూడమని ప్రజలను కోరుతున్నాం. నష్టపోయిన లక్షలాది ఎకరాల్లో  పంటలకు ఎన్యూమరేషన్ జరగలేదు. ఇన్ని లెక్కలు వేసుకుంటున్న మీకు ప్రజలు ఏ లెక్క వేస్తారో అర్ధం కావడం లేదా?

ఎన్నో సంస్థలు.. స్వచ్చంద సంస్థలు వరద బాధితులకు సాయం చేశాయి. వైఎస్సార్‌సీపీ కూడా ముందుకు వచ్చి వరద సాయం అందించింది. దాతల నుంచి వచ్చిన వరద సాయాన్ని హారతి కర్పూరం చేశారు. ఇప్పటికీ విజయవాడలో సాయం అందలేదని వరద బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. వరద నష్టం కోసం మేయర్ అడిగితే విజయవాడ అధికారులు ఎందుకు నిరాకరించారు. ఇంత దుర్మార్గంగా ఖర్చు చేశామని లెక్కలు ఎలా రాస్తారు. రేపు ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు మన గురించి ఎలా ఆలోచిస్తారు అని చంద్రబాబుకు ధ్యాసే లేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: పవన్‌ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)