Breaking News

పోలీసులపై కాకాణి సీరియస్‌.. బాధితులను పరామర్శించడమే నేరమా?

Published on Fri, 02/27/2026 - 12:11

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. కోవూరులో‌ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్యను ఖండించడమే నేరమా.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడం పాపమా? అని ప్రశ్నించారు. కోవూరు ఘటన ముమ్మటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి కాకాణి ఈరోజు.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం, కాకాణి మాట్లాడుతూ.. ‘కోవూరులో బాలిక హత్యను ఖండించడమే నేరమా?. పోక్సో చట్టంపై అవగాహన ఉన్న మేము ఎక్కడా బాలిక వివరాలు వ్యాఖ్యానించలేదు. అధికార పార్టీలోని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఈ ఘటనలో స్వయంగా గంజాయిపై వ్యాఖ్యలు చేశారు. నిందితుల పట్ల ఉదాశీలతగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ అక్రమ కేసులో నాకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి అధికార పార్టీ ముందుకు రావడం లేదు.

జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ కేసులో సంబంధం లేని ప్రశ్నలు వేశారు. కోవూరు మైనర్ బాలిక కేసు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. పరిపాలన చేత కాకపోతే వైఎస్‌ జగన్ పాలన చూసి నేర్చుకోండి. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదు. నిన్న వైఎస్‌ జగన్ ‌నెల్లూరు పర్యటనకు అశేష జనాభా కదిలి వచ్చారు. వైఎస్‌ జగన్ ప్రజాదరణ ఓర్వలేక పచ్చ‌ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది’ అని మండిపడ్డారు. 

బాధితులను పరామర్శించడమే నేరమా? వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)