అక్కడికి వచ్చే దమ్ముందా?.. సోమిరెడ్డికి కాకాణి సవాల్‌

Published on Wed, 12/11/2024 - 11:48

సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్‌ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ఇదే సమయంలో సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా?. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్‌లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా?.

సోమిరెడ్డికి నేను సవాల్‌ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్‌?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ ఆరోపణలు చేశారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)