Breaking News

‘కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణం తీస్తారా?’

Published on Mon, 01/19/2026 - 16:01

సాక్షి, తాడేపల్లి: ఏపీలో దళితులకు రక్షణ లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు. ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం పని చేయడం లేదని కూటమి నేతలపై ఘాటు విమర్శలు చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు, దళితులు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు.  ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి అదే. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్‌ జగన్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. ఓటు వేశారా? లేదా? అనే తారతమ్యాలు లేవు.

కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మందా సాల్మన్ హత్య ప్రభుత్వం చేసిన హత్యే. ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సాల్మన్ హత్యను కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం ఉంది. దళితులంతా ఒకసారి ఆలోచన చేయాలి. పోరాటమా.. శరణమా తేల్చుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్యలపై ప్రజా ఉద్యమం చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.  
 జగనన్నకు ఓటేస్తే చంపేస్తావా? బాబుపై జూపూడి ఫైర్

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)