Breaking News

ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై జయచంద్ర రెడ్డి ధ్వజం

Published on Tue, 05/06/2025 - 18:54

వైఎస్సార్ కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్యే  వ్యవహార శైలిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి పత్రికపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన విమర్శలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె  అవినీతి చిట్టా బయట పెడుతుందనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మాధవిరెడ్డిపై అన్ని వార్తా పత్రికల్లో, టీవీ చానెల్స్ లో ఇప్పటికే కథనాలు వస్తున్నాయని గుర్తుచేశారు. 

జిల్లాలో ఆమె చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆయన అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని చెరువు స్థలాల్లో వెంచర్లు వేస్తున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. మాధవిరెడ్డి అనుచరులు బహిరంగంగానే అవినీతి పనులు చేస్తున్నారన్నారు. స్థానిక బిల్డర్ల నుంచి కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేపై జయచంద్రారెడ్డి ఆరోపించారు.

ఏపీలో కూటమి సర్కార్‌ మొదలైన సమయం నుంచి కడపలో అక్రమాలు పెరిగిపోయాయని ప్రజలు ప్రత్యక్షంగానే చెబుతున్నారు. దేవుని కడపలోని 450 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు ప్లాన్‌ వేశారు. తప్పడు డాక్యుమెంట్లు తయారు చేసి ఇప్పటికే అక్కడ ప్లాట్లు వేసేందుకు పనులు కూడా ప్రారంభించారు. దానిని స్థానిక రైతులు అడ్డుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. కోట్ల రూపాయలు విలువ చేసే 450 ఏకరాల భూమిని కొట్టేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు స్కెచ్‌ చేశారు. పనులు ఆపకపోతే చూస్తూ తాము సహించబోమని రైతులు హెచ్చరించారు. స్థానిక రైతులు చెప్పిన ఇదే విషయాన్ని సాక్షి పత్రిక ప్రచురణ చేయడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి  అక్కసు వెల్లగక్కిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)